పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: ఎమ్మెల్యే
PDPL: రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదివారం రాత్రి గోదావరి నది తీరంలో చేపట్టిన వన దేవతలు సమ్మక్క- సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.