ఉపాధ్యాయురాలి గైర్హాజరుపై ఎమ్మెల్యే అసంతృప్తి

ఉపాధ్యాయురాలి గైర్హాజరుపై ఎమ్మెల్యే అసంతృప్తి

NDL: డోన్ మండలంలోని మల్యాల మండల పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో బోధన, మౌలిక వసతులు, పరిశుభ్రతపై సమీక్షించి సూచనలు చేశారు. అంగన్వాడీలో పోషకాహారం, ఆరోగ్య సేవలపై దృష్టి సారించారు. ఉపాధ్యాయురాలు గైర్హాజరు కావడంతో అసంతృప్తి వ్యక్తం చేసి, చర్యలకు ఆదేశించారు.