ఆదర్శంగా నిలుస్తున్న అంగన్వాడీ టీచర్

ఆదర్శంగా నిలుస్తున్న అంగన్వాడీ టీచర్

BDK: అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం రెండో అంగన్వాడీ కేంద్రం ఆకట్టుకుంటుంది. చిన్నారులను కేంద్రం వైపు మళ్లించేందుకు టీచర్ కుంజా ఏసుకుమారి చేస్తున్న కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. భవనం గోడలకు రూ.17,500 సొంత ఖర్చుతో ఆకట్టుకునే చిత్రాలు, విజ్ఞానాన్ని పంచేలా బొమ్మలు వేయించారు. ప్రస్తుతం కేంద్రంలో 28 మంది పిల్లలు, 5 గర్భిణులు ఉన్నారని టీచర్ వెల్లడించారు.