'ప్రతి కష్టజీవి సమస్యల పరిష్కారానికి బీజేపీ కట్టుబడి ఉంది'

HYD: తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్లు BJP రాష్ట్ర అధ్యక్షులు రాం చందర్ రావుని నగరంలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా రాం చందర్ రావు మాట్లాడుతూ.. ప్రతి కష్టజీవి కుటుంబం పక్షాన నిలబడి, వారి సమస్యలు పరిష్కారించడానికి BJP కట్టుబడి ఉందని పేర్కొన్నారు.