పొట్టి శ్రీరాములు సమాజం కోసం జన్మించారు: ఎస్పీ

KDP: సమాజం కోసం జన్మించిన వారిలో పొట్టి శ్రీరాములు అగ్రగణ్యుడు అని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కొనియాడారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతిని కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అహింసకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని తెలిపారు.