వరిపంటకు తెల్ల కంకులు.. ఆందోళనలో అన్నదాతలు

MDK: నంగునూర్ మండలంలో తెల్ల కంకుల సమస్య అన్నదాతను ఆందోళనకు గురిచేస్తోంది. వరి పంట పొట్టకొచ్చిన దశలో తెల్లకంకులు పుట్టుకొస్తున్నాయి. యాసంగీలో సాగు నీళ్లకు కొరత ఉన్నా, రైతులు వ్యయ ప్రయాసలకోర్చి పంటను సాగు చేస్తున్నారు. మందులు పిచికారి చేసినా వరిలో తెల్లకంకులు విపరీతంగా పుట్టుకొస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు.