హాస్టల్ ఆహారంలో సీసా పెంకులు.. విద్యార్థుల ఆందోళన

కోనసీమ: మల్కిపురం మండలంలోని తూర్పుపాలెం సాంఘిక సంక్షేమ హాస్టల్లో పెట్టే అన్నంలో సీసా, పెంకులు వస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుళ్లిన కూరలు, పురుగులు అన్నం పెడుతున్నారని వాపోతున్నారు. గతరాత్రి అన్నంలో సీసా పెంకులు తగలడంతో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుక్, స్వీపర్, వాచ్‌మెన్‌ను తల్లిదండ్రులు నిలదీశారు.