'రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు'
NTR: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని DCP షరీన బేగం కోరారు. మంగళవారం ఆమె నిడమానూరు జాతీయ రహదారిని పరిశీలించారు. ప్రాణం ఎంతో విలువైందని, రోడ్డు ప్రమాదాల వల్ల ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రాకుండా అధికారులు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. హైవేలపై వాహనాల వేగంకు అడ్డుకట్ట వేయాలని కోరారు.