15 మంది కీలక మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఐదుగురు మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని అధికారులు పిలుపునిస్తున్నారు. పోలీసుల ముందుకు వచ్చిన వారికి పూర్తి భద్రత ఉంటుందని హామీ ఇస్తుండటంతో మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నట్లు తెలుస్తోంది.