VIDEO: నీటమునిగిన శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయం

ELR: ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుట్టాయిగూడెం మండలంలోని శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం నీట మునిగింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ఆలయానికి రావద్దని అధికారులు సూచించారు.