చెన్నూరులో BRS, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట

చెన్నూరులో BRS, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట

KMM: కల్లూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడి చేసి రూ.95 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు కలుగజేసుకుని కార్యకర్తలను చెదరగొడుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.