ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం
MNCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సర్పంచ్ అల్లూరు సంపత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎముకలు, దంతాలు, కళ్ళు, స్త్రీ వ్యాధులకు సంబంధించి వైద్య నిపుణులు పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు.