చలో మెడికల్ కాలేజ్ పోస్టర్ ఆవిష్కరణ
NDL: బనగానపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో గురువారం నాడు చలో మెడికల్ కాలేజ్ పోస్టర్‌ను వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అంబటి రవికుమార్ ఆవిష్కరించారు. ఈ నెల 19న నంద్యాల జిల్లా కేంద్రంలో చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని వైయస్సార్ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నదని అంబటి రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రవికుమార్ కోరారు.