బస్టాండ్ ప్రాంగణం బురదమయం... ప్రయాణికులకు ఇక్కట్లు

ADB: ఇటీవల కురిసిన వర్షాలకు నిర్మల్ జిల్లా బాసర బస్టాండ్ ప్రాంగణం బురదమయంగా మారుతోంది. బస్సు ఎక్కాలన్నా, దిగాలన్నా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. బస్సుల రాకపోకలతో ప్రాంగణం చిత్తడి చిత్తడిగా మారుతోంది. దీంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించాలని పలువురుకోరుతున్నారు.