భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది
NLG: జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రభుత్వం భూభారతిలో పక్కాగా హద్దులు తేల్చేందుకు సిద్ధమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సర్వే కోసం నల్లగొండ జిల్లాలోని 70 గ్రామాలను ఎంపిక చేసింది. అందులో 8627 సర్వే నెంబర్‌ల పరిధిలో 72,758 ఎకరాల భూమిని సర్వే చేసి లెక్కలు తేల్చేందుకు సిద్ధమవుతుంది.