ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: CI

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: CI

KDP: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేంపల్లె సీఐ టి. నరసింహులు బుధవారం హెచ్చరించారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలు, పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ సూచనల మేరకు, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని ఆయన కోరారు. విద్యుత్ తీగలు, పోల్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.