యుద్ధం ముగిసినట్టేనా..?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినా.. యుద్ధం అప్పుడే ముగియదని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ దేశానికి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఈ యుద్ధాన్ని కొనసాగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇరాన్ ప్రాక్సీలైనా హెజ్బుల్లా, హమాస్, హౌతీలు కూడా దాడులు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో భయాందోళనలు నెలకొన్నాయి.