ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: గుడివాడ అమర్నాథ్

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: గుడివాడ అమర్నాథ్

AP: యూరియా విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సీజన్ పూర్తయ్యాక యూరియా ఇస్తే ఉపయోగం ఏంటి? అని ప్రశ్నించారు. యూరియా విషయంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమన్నారు. యూరియాపై ప్రశ్నిస్తే.. అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు. రైతులకు మద్దతుగా ఈ నెల 9న పెద్దఎత్తున నిరసనలు చేపడుతామని అన్నారు.