లాటరీ పద్ధతిలో "స్మార్ట్ స్ట్రీట్ బజార్" దుకాణాల కేటాయింపు

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని మైపాడు గేటు రోడ్డు, జాఫర్ సాహెబ్ కాలువ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న "స్మార్ట్ స్ట్రీట్ బజార్" ప్రాజెక్టులో 120 దుకాణాలను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు శుక్రవారం కేటాయించారు. టౌన్ వెండింగ్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా లాటరీ విధానాన్ని లబ్ధిదారుల సమక్షంలో అమలు చేశారు.