హుకుంపేటలో గర్భిణికి డోలి కష్టాలు.. 6 కి.మీ మోత
ASR: హుకుంపేట మండలం చుల్లిపకనలో రహదారి లేక గర్భిణి చిట్టం జ్యోతిని కుటుంబీకులు డోలిలో 6 కి.మీ మోశారు. వాహనాలు రాలేని స్థితిలో బూర్జ పంచాయతీ పరిధిలోని ఈ గ్రామం నుంచి మజ్జివలస వరకు మోసుకొచ్చి, అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి కష్టాలకు ఈ ఘటన నిదర్శనం.