గుంతల రోడ్డుతో వాహనదారుల ఇక్కట్లు
కృష్ణా: గణపవరం అడ్డరోడ్డు నుంచి చంద్రాల వెళ్లే రహదారి గుంతలతో అద్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మైలవరం హైవే రింగులో ప్రమాదకరంగా మారిన ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కనీసం మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.