VIDEO: మహాశివరాత్రికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ఎస్సై
కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి సన్నిధిలో ఆదివారం జరిగే మహాశివరాత్రి వేడుకలకు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పెట్టామని, రోడ్డు మార్గంలో మార్పులు చేశామని, భక్తులు సహకరించాలని కోరారు. భక్తులు తమ ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలని, చిన్నపిల్లలను అప్రమత్తంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.