ధర్మాపూర్ పంచాయతీ భవన పనుల పరిశీలన
WNP: అమరచింత మండలం ధర్మాపూర్లో NREGS నిధులతో నిర్మిస్తున్న కొత్త గ్రామపంచాయతీ భవన పనులను సర్పంచ్ దాసరి సావిత్రమ్మ పరిశీలించారు. రూ.20 లక్షలతో నిర్మాణం జరుగుతోందని ఇవాళ తెలిపారు. మహిళా భవనానికి కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి భూమి దానం చేశారు. పనులను నాణ్యతగా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యదర్శి మోహన్, కాంట్రాక్టర్ రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.