సైబరాబాద్ సీపీ వెబ్‌సైట్ సాంకేతిక సమస్య

సైబరాబాద్ సీపీ వెబ్‌సైట్ సాంకేతిక సమస్య

TG: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఓపెన్ చేస్తే గేమింగ్ సైట్‌కు రీడైరెక్ట్ అవుతోందని అధికారులు వెల్లడించారు. సమస్యపై ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. పూర్తిస్థాయి పునరుద్ధరణకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.