భోగి మంటల్లో వైద్య కళాశాలల జీఓ దహనం

భోగి మంటల్లో వైద్య కళాశాలల జీఓ దహనం

VSP: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ వైసీపీ నేతలు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన భోగి మంటల్లో సంబంధిత జీఓ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు కె. కె. రాజు మాట్లాడుతూ, ప్రజారోగ్య రంగాన్ని దెబ్బతీసే నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి సంబరాల్లో పార్టీ నాయకులు పాల్గొన్నారు