బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మంత్రి నివాళి

బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మంత్రి నివాళి

E.G: నిడదవోలు మండలం కంసాలిపాలెంలో స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల అభ్యుదయానికి కృషి చేసిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత, పీడిత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ అని స్మరించుకున్నారు.