బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

SKLM: హిరమండలం మండలం పిండ్రువాడ గ్రామంలో పిడుగుపాటుకు రైతు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. రూ. 4 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.