VIDEO: చెరువులో మహిళ మృతదేహం లభ్యం
WGL: నర్సంపేట మండల పరిధిలో మాదన్నపేట గ్రామ శివారులో ఉన్న చెరువులో ఈరోజు నాలుగు గంటల సమయంలో గుర్తు తెలియని మహిళ మృతి దేహం లభ్యం అయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలు బాంజీపేట శివారు నర్సినాయక్ తండాకు చెందిన మహిళగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.