VIDEO: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గుడివాడలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాము పాల్గొని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ చేసే గొప్ప పనులు వల్ల రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలతో పాటు, టీడీపీ శ్రేణుల మనస్సులను కూడా గెలుచుకున్నారని తెలిపారు.