పెహల్గాం దాడి బాధాకరం: కాంగ్రెస్ నాయకులు

CTR: జమ్మూ కశ్మీర్‌లో అమాయక పర్యాటకులపై ముష్కరుల దాడి బాధాకరమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. పుంగనూరులోని ముడెప్ప సర్కిల్లో గురువారం రాత్రి మృతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు అయుబ్, ముబారక్, ఫయాజ్, ఇబ్రహీం, పాల్గొన్నారు.