MROకి వినతి పత్రం అందజేత

SKLM: ఆమదాలవలస ఎమ్మార్వో కార్యాలయం వద్ద గురువారం 2003-డీఎస్సీ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం వారు ఎమ్మార్వో రాంబాబుకు వినతిపత్రం అందజేసి, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 2003 డీఎస్సీ ఫోరం జిల్లా కన్వీనర్ శ్రీహరితో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.