జర్మనీలో ఉద్యోగ అవకాశాలు
ELR: జర్మనీ నిర్మాణ రంగంలో రెండేళ్ల కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్రబాబు గురువారం తెలిపారు. ఐటీఐ, డిప్లొమా అర్హతతోపాటు ఎలక్ట్రిషియన్ వర్క్ రెండేళ్ల అనుభవం ఉన్న 18-30 ఏళ్ల పురుషులు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్ సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.