నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్
SKLM: కవిటి మండలం బొరివంక సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ మరమ్మతుల పనుల నిమిత్తం బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ యజ్ఞేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బోకిడియా పుట్టుగ, పెట్టవీధి, దూగాన పుట్టుగ, కోర్రాయిపుట్టుగ, తదితరులు గ్రామాలకు అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.