కన్నీటిని మిగిల్చిన అకాల వర్షం

CTR: జిల్లాలో శుక్రవారం కురిసిన అకాలవర్షం పలువురుకి కన్నీటిని మిగిల్చింది. సదుం, సోమల, పలమనేరు తదితర ప్రాంతాలలో కురిసిన భారీవర్షాలకు మామిడిపండ్లు నేలరాలాయి. అసలే పంటదిగుబడి తక్కువగా ఉందని ఆందోళన చెందుతున్న రైతులకు ఈ వర్షం శరాఘాతంగా మిగిలింది. పలుచోట్లు బలమైన ఈదురుగాలులకు ఇంటి పై కప్పులు ఎగిరిపడ్డాయి. టమాటా, అరటిపంటలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.