కుక్క మృతదేహం రోడ్డుపైనే.. అధికారుల స్పందన ఎక్కడ?

HYD: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లైన్ నెంబర్ 3లో రోడ్డుపై కుక్క మృతి చెంది రెండు రోజులు అవుతుంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. కాలనీవాసులు, అటుగా వెళ్లే ప్రజలు ముక్కులు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. GHMC అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.