అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి

అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి

దక్షిణకొరియాలోని వాహనాల విడిభాగాల ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో 59 మంది గాయపడినట్లు చెప్పారు. క్షతగాత్రుల్లో 25 మంది పరిస్థితి విషమంగా ఉందని.. మరో 34 మందికి స్వల్పంగా గాయాలు అయినట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 174 మంది కార్మికులు ఉన్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది.