చిట్యాల లో మహిళా దినోత్సవ వేడుకలు
NLG: చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకురాలు, న్యాయవాది గాదె గీత తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీత, వైస్ ఛైర్‌పర్సన్ శ్రీలక్ష్మి, కమిషనర్ శ్రీను, సీఐ నాగరాజు, పలువురు కౌన్సిలర్లు ముఖ్య అతిథులుగా, అలాగే పలువురు గౌరవ అతిథులు హాజరుకానున్నారు.