'లోక్ అదాలత్ ద్వారా డబ్బు, సమయం ఆదా'

GDWL: పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి ఈ నెల 13న జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ ప్రేమలత తెలిపారు. బుధవారం కోర్టు ప్రాంగణంలోని తన ఛాంబర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్నిరకాల కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.