రోడ్డు భద్రతపై అవగాహన అవసరం: DSP

రోడ్డు భద్రతపై అవగాహన అవసరం: DSP

KMR: జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని DSP విఠల్ రెడ్డి అన్నారు. పిట్లంలో నిర్వహించిన “అలైవ్ అరైవ్” కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, రాంగ్ రూట్ లో ప్రయాణించవద్దని సూచించారు.