'అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తే చర్యలు'

'అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తే చర్యలు'

NLR: కమిషనర్ వై.వో నందన్ శుక్రవారం నగరంలోని జేమ్స్ గార్డెన్, రైల్వే ట్రాక్ సమీప ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఓ అపార్ట్మెంట్ వద్ద జరుగుతున్న నిర్మాణాన్ని పరిశీలించారు. అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అక్రమ కట్టడాలను పూర్తిస్థాయిలో తొలగిస్తామని హెచ్చరించారు.