సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

E.G: అనపర్తి మండలం కుతుకులూరులో నిర్మించిన సీసీ రోడ్లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 41 లక్షల నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.