'పాత్రికేయుల స్వేచ్ఛకు భంగం కలిగించొద్దు'

'పాత్రికేయుల స్వేచ్ఛకు భంగం కలిగించొద్దు'

CTR: పాత్రికేయుల స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని APWJF నాయకులు శుక్రవారం చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులుకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఓ ప్రముఖ దినపత్రిక ఎడిటర్ పై దాడులు, సోదాలు నిర్వహించడం పట్ల ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. విలేకరులపై ఓ పక్క అధికారులు, మరోపక్క రాజకీయ దాడులు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. విలేకరులకు రక్షణ కల్పించాలని కోరారు.