KGBVలో ప్రవేశాలకు ఆహ్వానం
BPT: ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని 28 KGBV విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. 6-ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు మిగిలిన సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారన్నారు. 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 40 సీట్లు ఉన్నాయని, అర్హులైన విద్యార్థినులు ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.