ఎస్సై హరీష్ ఆత్మహత్య కేసులో మహిళ అరెస్టు

ఎస్సై హరీష్ ఆత్మహత్య కేసులో మహిళ అరెస్టు

MLG: జిల్లాలో సంచలనం రేపిన వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అతని మరణానికి కారణమైన మహిళ బానోతు అనసూర్య అలియాస్ అనూషను శనివారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితురాలు బానోతు అనసూర్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరిచినట్లుగా సీఐ తెలిపారు.