అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

విశాఖలోని మధురవాడ ఆర్టీసీ కాలనీ సాయిప్రియ నివాస్ సమీపంలో స్వతంత్రనగర్‌కు చెందిన కారు డ్రైవర్ కుమ్మరపు రవి (41) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గురువారం ఇంటి నుంచి వెళ్లిన ఆయన, శుక్రవారం పొదల్లో మృతి చెంది కనిపించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.