స్కానింగ్ కేంద్రాల వద్ద సూచనలు పాటించాలి: DMHO
BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో బుధవారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిరోధక చట్టం (PCPNDT Act) అమలుపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. DMHO డా. మధుసూదన్ మాట్లాడుతూ.. స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు కచ్చితంగా క్రింది సూచనలు పాటించాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలు గుర్తించితే వెంటనే వైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.