బాలికల అదృశ్యంపై కేసు నమోదు
E.G: కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన ఇద్దరు మైనర్ బాలికల అదృశ్యంపై కేసు నమోదైంది. పూసలు అమ్ముకునే నిమిత్తం గురువారం ఆటోలో రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి రాకపోవడంతో శుక్రవారం వారి తండ్రి అన్నవరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ విశ్వం కేసు నమోదు చేశారు. బాలికల ఆచూకీ తెలిసిన వారు 94407 96622, 9154875 583 నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.