VIDEO: అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం
కోనసీమ: ఐ.పోలవరం మండలంలో 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు వెంకట కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి లేఖ రాశారు. కాగా నిందితుడిపై పోక్సో కేసు పెట్టిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అతడు మరో బాలికపైనా అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసిందని DSP ప్రసాద్ శుక్రవారం రాత్రి తెలిపారు.