అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్
AP: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ నిబంధనలను అనంతబాబు అతిక్రమించారంటూ రాజమండ్రి ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్బారావు పిటిషన్ వేశారు. సాక్షులకు డబ్బు ఇచ్చి మభ్యపెట్టారని.. చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని పిటిషన్‌లో వెల్లడించారు. అనంతబాబు బెయిల్‌ను తక్షణం రద్దు చేయాలని పేర్కొన్నారు.