పరిశ్రమలకు కలెక్టర్ వర్చువల్ శంకుస్థాపన
ASR: గిరిజన ఉత్పత్తుల ద్వారా ముడి సరుకులు తయారుచేసి, పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో రెండు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఆలోచన విధానం, మార్కెటింగ్‌పై గిరిజనులకు శిక్షణ ఇస్తామన్నారు.